Team India: టీమిండియా-బంగ్లాదేశ్ టెస్టు... ముగిసిన నాలుగో రోజు ఆట

  • చట్టోగ్రామ్ లో తొలి టెస్టు
  • బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల లక్ష్యం
  • నాలుగో రోజు ఆట చివరికి 6 వికెట్లకు 272 రన్స్ చేసిన బంగ్లా
  • మరో 4 వికెట్లు తీస్తే భారత్ కు విజయం
Fourth day play concludes in 1st test between Team India and Bangladesh

చట్టోగ్రామ్ లో టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట చివరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 272 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబల్ హసన్ 40, మెహిదీ హసన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ గెలవాలంటే ఇంకా 241 పరుగులు చేయాలి. మరో 4 వికెట్లు తీస్తే టీమిండియా గెలుస్తుంది. 

ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 404 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 150 పరుగుల స్కోరుకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను 258/2 స్కోరు వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. తద్వారా బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

More Telugu News