Swiggy Instamart: స్విగ్గీలో రూ. 16 లక్షల గ్రోసరీ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి!

  • బెంగళూరుకు చెందిన వ్యక్తి నుంచి వచ్చిన భారీ ఆర్డర్
  • ఫుడ్ కోసం వచ్చిన పెద్ద ఆర్డర్ విలువ రూ.75,378
  • నిమిషంలో డెలివరీతో రికార్డు
Bengaluru man orders groceries worth Rs 16 Lakh from Swiggy Instamart another spends Rs 70000 on burgers

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ పామ్ ‘స్విగ్గీ’ తన యూజర్ల నుంచి 2022 ఏడాదిలో వచ్చిన ఆర్డర్లను విశ్లేషించి ఆసక్తికరమైన కొన్ని వివరాలు వెల్లడించింది. అన్నింటిలోకీ బిర్యానీని ఎక్కువ మంది ఆర్డర్ చేస్తుండడం తెలిసిందే. ఇన్ స్టా మార్ట్ పేరుతో స్విగ్గీ ఓ గ్రోసరీ ప్లాట్ ఫామ్ ను కూడా నిర్వహిస్తోంది. దానిపై ఈ ఏడాదిలో వచ్చిన అతిపెద్ద ఆర్డర్ విలువ రూ.16 లక్షలు కావడం గమనార్హం. 


బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఇంత పెద్ద ఆర్డర్ చేశాడు. అది కూడా గ్రోసరీల కోసం. స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ పై ఓ యూజర్ చేసిన అతిపెద్ద ఆర్డర్ ఇదేనట. దీపావళి సమయంలో బెంగళూరుకు చెందిన ఓ యూజర్ స్విగ్గీపై రూ.75,378 విలువైన ఫుడ్ ఆర్డర్ చేశాడట. పూణెకు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తి తన టీమ్ కోసం బర్గర్లు, ఫ్రైస్ ఆర్డర్ చేయగా, దీని విలువ రూ.71,229. 

ఇక స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ అతి వేగంగా డెలివరీ చేసిన ఆర్డర్ ఒకటి ఉంది. కస్టమర్ ఆర్డర్ పెట్టిన కేవలం 1.03 నిమిషానికే అతడి చేతిలో డెలివరీ ప్యాక్ పెట్టేసింది. ఇది ఎలా సాధ్యమైందంటే ఇన్ స్టా మార్ట్ స్టోర్ కు కస్టమర్ ఇల్లు కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉంది.

More Telugu News