బిగ్ బాస్ హౌస్ లో హడావిడి .. శ్రీసత్య ఎలిమినేషన్! 

  • బిగ్ హౌస్ లో అనూహ్య పరిణామం 
  • టాప్ 5 లో కొనసాగే అర్హత కీర్తికి లేదన్న హౌస్ మేట్స్ 
  • జనాల అభిప్రాయం మరోలా ఉందంటూ శ్రీసత్య ఎలిమినేషన్ 
  • షాక్ నుంచి కోలుకోని ఇంటి సభ్యులు 
  • టాప్ ఫైవ్ లో ఉండవలసిన శ్రీసత్య వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్
Bigg Boss 6  Update

'బిగ్ బాస్ హౌస్' నుంచి మిడ్ వీక్ లో ఒకరు బయటికి వెళ్లిపోతారని పోయిన ఆదివారం నాగార్జున చెప్పారు. దాంతో ఇంటి సభ్యులైన ఆరుగురిలో నుంచి ఎవరు బయటికి వెళ్లిపోతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ లో హడావిడి మొదలైంది. ఉదయం 6 గంటలకే హౌస్ లోని సభ్యులను నిద్రలేపేశారు. అందుకు కారణం ఏమిటో తెలియక ఎవరికి వారు కంగారు పడిపోయారు. 

'మిడ్ వీక్ ఎలిమినేషన్' జరగనుందనీ .. ఇంటి సభ్యులంతా తమ లగేజ్ ను ప్యాక్ చేసుకుని రెడీగా ఉండాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో తమలో ఎవరు వెళ్లిపోనున్నారనే విషయంలో సభ్యులలో ఆందోళన కనిపించింది. హౌస్ లో ఉన్న ఆరుగురిలో టాప్ ఫైవ్ లో ఉండే అర్హత ఎవరికి లేదనేది ఒక్కొక్కరిగా చెప్పమని బిగ్ బాస్ వారినే అడిగాడు. సభ్యులలో ఎక్కువమంది కీర్తి పేరు చెప్పారు.

దాంతో హౌస్ నుంచి కీర్తి వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఒక్కసారిగా శ్రీసత్య పేరు ఎనౌన్స్ చేశారు. ఓట్ల ద్వారా జనాలు వ్యక్తం చేసిన అభిప్రాయం వేరేలా ఉందంటూ శ్రీసత్యను బయటికి పంపించారు. దీంతో హౌస్ లోని వారే కాదు .. టీవీల ముందు కూర్చున్నవారు కూడా షాక్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ కి శ్రీసత్య గ్లామర్ ను తీసుకొచ్చింది. జెంట్స్ తో సమానంగా గేమ్స్ ఆడింది. పైగా తను మాటకారి కూడా. అలాంటి అమ్మాయి ఎలిమినేట్ కావడమేంటి? అనే ప్రశ్న అందరిలో తలెత్తింది..

More Telugu News