Dil Raju: 'వారసుడు' సినిమా ఈ ఇద్దరు హీరోలతో కుదరలేదు.. చివరకు విజయ్ వద్దకు వెళ్లింది: దిల్ రాజు

Mahesh Babu and Ramcharan missed Varasudu movie
  • జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'వారసుడు'
  • తొలుత మహేశ్ లేదా రాంచరణ్ లతో చేయాలని ప్లాన్ 
  • ఇద్దరూ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో విజయ్ వద్దకు వెళ్లిన సినిమా
ఈ సారి సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న వస్తోంది. బాలయ్య సినిమా 'వీరసింహా రెడ్డి' జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినవే కావడం గమనార్హం. మరోవైపు తమిళ హీరో విజయ్ తో దిల్ రాజు నిర్మించిన 'వారసుడు' సినిమా కూడా జనవరి 12నే విడుదల కాబోతోంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.  

ఇదిలావుంచితే, 'వారసుడు' సినిమాకు సంబంధించి దిల్ రాజు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు హీరోగా తొలుత విజయ్ ను అనుకోలేదని చెప్పారు. మహేశ్ బాబుతో ఈ చిత్రాన్ని చేయాలని వంశీ పైడిపల్లి అనుకున్నారని, అయితే వేరే ప్రాజెక్ట్ తో మహేశ్ బిజీగా ఉండటం వల్ల కుదరలేదని చెప్పారు. ఆ తర్వాత రాంచరణ్ తో అనుకున్నామని, కానీ ఆయన అప్పటికే తన తదుపరి సినిమా డిస్కషన్ లో ఉండటంతో సాధ్యపడలేదని తెలిపారు. దీంతో, చివరకు ఈ సినిమా విజయ్ వద్దకు వెళ్లిందని అన్నారు. 

ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. ప్రకాశ్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, జయసుధ, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతాన్ని అందించారు.
Dil Raju
Vijay
Mahesh Babu
Ramcharan
Varasudu Movie

More Telugu News