Ganta Srinivasa Rao: కన్నా లక్ష్మీనారాయణను కలవడంపై గంటా శ్రీనివాసరావు వివరణ

Ganta Srinivasa Rao response on meeting with Kanna Lakshminarayana
  • ఒక వివాహం కోసం విజయవాడకు వచ్చిన గంటా
  • వివాహానంతరం గంటా నివాసంలో కాపు నేతల భేటీ
  • హాజరైన కన్నా లక్ష్మీనారాయణ, బొండా ఉమ
టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారుతున్నాననే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. ఒకవేళ పార్టీ మారితే ఆ విషయాన్ని తానే అందరికీ చెపుతానని అన్నారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. వెల్లంపల్లి కుమార్తె పెళ్లి సందర్భంగా కలుసుకోవడం జరిగిందని తెలిపారు. వంగవీటి రంగా వర్ధంతి అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు.  

మరోవైపు, నిన్న రాత్రి విజయవాడలోని తన నివాసంలో కాపు సామాజికవర్గ నేతలు భేటీ అయ్యారు. విజయవాడలో వివాహ కార్యక్రమానికి గంటా వచ్చారు. వివాహం అనంతరం కాపు నేతలు గంటా నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బొండా ఉమ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని గంటా అన్నారు.
Ganta Srinivasa Rao
Kanna Lakshminarayana
Bonda Uma
Kapu Leaders

More Telugu News