ఏపీ సీఐడీ కేసులో అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట
- అయ్యన్నపై నర్సీపట్నంలో భూ ఆక్రమణ ఆరోపణలు
- కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
- ఈ కేసులో సెక్షన్ 467 వర్తింపజేయలేరన్న హైకోర్టు
- హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కారు
- ఏపీ సర్కారుకు సుప్రీంలో చుక్కెదురు
అయితే, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.