మా చంద్రం అన్నయ్యే తేల్చేశాడు: విజయసాయిరెడ్డి

మా చంద్రం అన్నయ్యే తేల్చేశాడు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on Chandrababu
  • పార్టీలేదు, బొక్కా లేదని చంద్రబాబు అన్నారన్న విజయసాయి
  • పార్టీ నిర్వీర్యమైపోతోందన్నారని ట్వీట్
  • తమ్ముళ్లూ సర్దుకోండిక అని ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. పార్టీలేదు, బొక్కా లేదు అని చంద్రబాబు అన్నారని ఆయన ట్వీట్ చేశారు. ఒక వీడియోను కూడా షేర్ చేశారు. మొన్న అచ్చెన్న... నిన్న స్వయంగా చంద్రబాబే పార్టీలేదు, బొక్కాలేదు అనేశారని అన్నారు. 

రోజురోజుకూ పార్టీ నిర్వీర్యం అయిపోతోందని మా చంద్రం అన్నయ్యే తేల్చేశారని చెప్పారు. ఎల్లో మీడియా ఎన్ని బాకాలు ఊదినా, పెగ్గురాజు ఢిల్లీలో ఎంత పేలినా ఇక లాభం లేదని అన్నారు. టీడీపీకి 2024 ఎన్నికలే చివరివని చెప్పారు. తమ్ముళ్లూ సర్దుకోండిక అని ఎద్దేవా చేశారు.
Advertisement
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News