TikTok: అమెరికాలోనూ టిక్ టాక్ పై నిషేధం తప్పదా?

  • బిల్లును ప్రతిపాదించిన రిపబ్లికన్, డెమొక్రటిక్ సభ్యులు
  • టిక్ టాక్ ద్వారా అమెరికన్లపై చైనా నిఘా పెడుతోందన్న ఆరోపణలు
  • నిషేధించాలని డిమాండ్
US lawmakers move to ban TikTok amid China spying fears

దేశ భద్రతకు ముప్పు ఉందంటూ టిక్ టాక్ సహా వందలాది చైనా యాప్ లపై భారత సర్కారు 2020లోనే వేటు వేసింది. నిజానికి ఇది గల్వాన్ లోయ సరిహద్దు ఘర్షణలకు ప్రతీకారంగా భారత్ తీసుకున్న చర్యగానే అంతర్జాతీయ సమాజం భావించింది. తమదాకా వస్తే కానీ బోధపడదన్నట్టు.. ఇప్పుడు అమెరికాలోని విధాన నిర్ణేతలు (చట్ట సభల సభ్యులు) టిక్ టాక్ పై నిషేధానికి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు టిక్ టాక్ పై నిషేధం ప్రతిపాదిస్తూ డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీలు ఓ బిల్లును ప్రవేశపెట్టాయి. 

టిక్ టాక్ యాప్ తో అమెరికన్లపై చైనా నిఘా పెడుతోందన్నది చట్ట సభల సభ్యుల ఆరోపణగా ఉంది. బీజింగ్ నియంత్రణలో నడుస్తున్న టిక్ టాక్ ను నిషేధించే సమయం ఇదేనని ఈ బిల్లును ప్రతిపాదించిన రిపబ్లికన్ నేత మార్కో రుబియో పేర్కొన్నారు. టిక్ టాక్ ముప్పు నుంచి అమెరికన్లను రక్షించేందుకు బైడెన్ సర్కారు ఎలాంటి అర్థవంతమైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. 2020లో డొనాల్డ్ ట్రంప్ సర్కారు కొత్త యూజర్లు టిక్ టాక్ డౌన్ లోడ్ చేసుకోకుండా ఆంక్షలు తీసుకొచ్చారు. కానీ, ఆ తర్వాత కోర్టు ఈ చర్యలను నిలిపివేయడం గమనార్హం.

More Telugu News