ఇండియాలోనే అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేసిన హైదరాబాదీ!

Hyderabad business man buys Mclaren LT car
  • ఇటీవలే ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన మెక్ లారెన్
  • ముంబైలో తొలి డీలర్ షిప్ ను ప్రారంభించిన సంస్థ
  • మెక్ లారెన్ 765 LTని సొంతం చేసుకున్న నసీర్ ఖాన్
భారత్ లో ఇటీవలి కాలంలో ఖరీదైన కార్ల కొనుగోళ్లు పెరిగాయి. ప్రపంచంలోని ఖరీదైన కార్లు ఇండియన్ మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని సొంతం చేసుకోవడానికి శ్రీమంతులు మొగ్గుచూపుతున్నారు. తాజాగా మన మార్కెట్లోకి మెక్ లారెన్ ప్రవేశించింది. ముంబైలో ఇటీవలే తన మొదటి డీలర్ షిప్ ను ప్రారంభించింది. ప్రారంభ వేడుకల్లో తన సూపర్ కార్ మెక్ లారెన్ 765 LTని లాంచ్ చేసింది. మన దేశంలో ప్రస్తుతం లభిస్తున్న అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి. ఈ కారును హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ కొనుగోలు చేశారు. ఈ కారు ఖరీదు రూ. 12 కోట్లు ఉంటుందని చెపుతున్నారు. ఇప్పటికే ఈయన వద్ద ఫెరారీ, లంబోర్ఘిని, రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.
Go Back to Shorts
Mclaren LT
Hyderabadi

More Telugu News