Ganta Srinivasa Rao: టీడీపీని వీడటంపై క్లారిటీ ఇచ్చిన గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao gives clarity on party change
  • పార్టీ మార్పుపై తానెప్పుడూ మాట్లాడలేదన్న గంటా
  • ఏదైనా నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తానని వెల్లడి
  • రంగా ఏ ఒక్క కులానికో, ప్రాంతానికో పరిమితం కాదని వ్యాఖ్య

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీని వీడి వైసీపీలో చేరబోతున్నారంటూ కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పుపై తానెప్పుడూ మాట్లాడలేదని ఆయన చెప్పారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నవి కేవలం రెండు పార్టీలు మాత్రమే కాదని వ్యాఖ్యానించారు.

ఇక వంగవీటి రంగా ఏ ఒక్క కులానికో, ప్రాంతానికో ప్రతినిధి కాదని... రంగా బడుగు, బలహీన వర్గాల నాయకుడని అన్నారు. బడుగు వర్గాల సంక్షేమం కోసం పాటుబడ్డారు కాబట్టే వారి గుండెల్లో రంగా చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. కాపునాడు బహిరంగసభ పోస్టర్ ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాపునాడు సభను విజయవంతం చేయాలని కోరారు. కాపునాడు పోస్టర్ పై వంగవీటి రంగా, మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ ఫొటోలను ప్రముఖంగా ముద్రించారు.

  • Loading...

More Telugu News