Gujarat: గుజరాత్‌లో ‘ఆప్’కు కొత్త కష్టాలు.. బీజేపీకి మద్దతు ఇస్తానన్న ఎమ్మెల్యే!

  • గుజరాత్‌లో ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు
  • బీజేపీకి బయటి నుంచి మద్దతునిస్తానన్న విశ్వదర్ ఆప్ ఎమ్మెల్యే
  • మిగతా వారిని రక్షించుకునే పనిలో ఆప్ అధిష్ఠానం
AAP MLA indicates he may join BJP later denies

గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాలు గెలుచుకుని మరోమారు అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఐదు స్థానాలతోనే సరిపెట్టుకుంది. గుజరాత్‌లో బోణీ కొట్టిన కేజ్రీవాల్ పార్టీకి ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తుండడమే ఇందుకు కారణం. 

జునాగఢ్ జిల్లాలోని విశ్వదర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆప్ ఎమ్మెల్యే భూపత్ భయానీ బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఈ వార్తలను ఆయన ఖండించారు. తాను అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని, కానీ ప్రజాభిప్రాయం తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరబోనన్న భూపత్.. ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తానని పేర్కొనడం గమనార్హం. దీంతో ‘ఆప్’ అధిష్ఠానం మిగతా ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది.

More Telugu News