మొక్కేందుకు వెళ్తే జీవీఎల్ ను కాలితో తన్నిన ఆవు
- గుంటూరులో మిర్చి ఎగుమతిదారుల అసోసియేషన్ ఆఫీస్ ఓపెనింగ్ కు వచ్చిన జీవీఎల్
- ఆవును తీసుకొచ్చిన అసోసియేషన్ సభ్యులు
- మొక్కేందుకు వెళ్లగా వెనుక కాలితో తన్నిన ఆవు
కార్యాలయం ప్రారంభోత్సవం కోసం అసోసియేషన్ వారు ఒక ఆవును తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆవుకు నమస్కరించేందుకు వెళ్లగా అది ఆయనను తన్నింది. అయితే పెద్దగా దెబ్బ ఏమీ తగల్లేదు. మరోసారి మొక్కేందుకు ప్రయత్నించగా అది మరోసారి కాలు లేపింది. దీంతో, అక్కడున్న వారు ఆయనను పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.