బంగ్లాదేశ్ పై భారీ సెంచరీతో చెలరేగిపోతున్న భారత యువ క్రికెటర్
- రోహిత్ శర్మ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్
- ఫోర్లు, సిక్సర్లతో విజృంభిస్తున్న వైనం
- భారీ స్కోరు దిశగా భారత్
అయితే, రోహిత్ శర్మ స్థానంలో మరో ఓపెనర్ గా బరిలోకి దిగిన యువ క్రికెటర్ ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. కోహ్లీ సహకారంతో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో 49 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇషాన్ 85 బంతుల్లోనే సెంచరీ మార్కు దాటాడు. ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. 103 బంతుల్లోనే 150 మార్కు అందుకొని భారత స్కోరు 250 దాటించాడు. కోహ్లీ సైతం 54 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి జోరు చూస్తుంటే భారత్ సులభంగా 420–450 పరుగులు చేసేలా ఉంది.