బాలకృష్ణతో అంతర్జాతీయ స్థాయిలో 'రామానుజాచార్య' సినిమా

  • ఒక అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకరతో కలిసి నిర్మిస్తున్నామన్న సి.కల్యాణ్  
  • చినజీయర్ స్వామి సహకారం వుందని వెల్లడి
  • ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్న కల్యాణ్
C Kalyan announces Ramanujacharya movie with Balakrishna

బాలకృష్ణతో భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో 'రామానుజాచార్య' సినిమాను నిర్మించబోతున్నామని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. ఒక అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకరతో కలిసి చినజీయర్ స్వామి సహకారంతో ఈ సినిమాను నిర్మిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. 'కల్యాణ్ అమ్యూజ్ మెంట్ పార్క్' ప్రారంభం రోజున ఈ చిత్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. 

ఇక 'కల్యాణ్ అమ్యూజ్ మెంట్ పార్క్' అనేది రూ.200 ప్రాజక్టు అనీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో దీనిని చేబడుతున్నామనీ నిర్మాత కల్యాణ్ తెలిపారు. ఈ పార్కులో వినోదం, ఆహారం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఇంత భారీ ప్రాజెక్టును తాను చేయడాన్ని దేవుడిచ్చిన వరంలా భావిస్తున్నానని చెప్పారు.  

More Telugu News