YS Sharmila: మధ్యాహ్నం లోటస్ పాండ్ లో దీక్షకు దిగనున్న షర్మిల

YS Sharmila to protest at Lotus Pond
  • షర్మిల పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు
  • హైకోర్టు అనుమతించినా పోలీసులు అనుమతించడం లేదని షర్మిల విమర్శలు  
  • పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేయనున్న షర్మిల
తన పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అసహనం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల పాదయాత్రతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందనే కారణంతో పాదయాత్రకు వరంగల్ పోలీస్ కమిషనర్ అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆమె మధ్యాహ్నం 12 గంటలకు లోటస్ పాండ్ లో దీక్ష చేపట్టనున్నారు. పాదయాత్రకు అనుమతించని పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేయనున్నారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా పోలీసులు అనుమతించకపోవడంపై ఆమె మండిపడుతున్నారు. పాదయాత్ర సందర్భంగా షర్మిల వాహనానికి టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. షర్మిల పాదయాత్ర కొనసాగితే ఇలాంటి ఘటనలే మళ్లీ పునరావృతమవుతాయని పోలీసులు భావిస్తున్నారు.
YS Sharmila
YSRTP
Deeksha

More Telugu News