ఏపీ, తెలంగాణను తర్వాత కలుపుదురు గానీ.. ముందు జగన్, షర్మిలను కలపండి: అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య
- విభజన హామీలను గాలికొదిలేసి ఇప్పుడు ఇలాంటి మాటలేంటన్న బాలకోటయ్య
- ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకేనని మండిపాటు
- అప్పుడు విభజన నిర్ణయం తీసుకోవచ్చంటూ లేఖ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? అంటూ ఫైర్
విభజన హామీలను గాలికొదిలేసి ఇప్పుడు ఉమ్మడి ఏపీని స్వాగతిస్తామని సజ్జల అనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపీ ఈ కొత్త నాటకానికి తెరతీసిందని దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే ఏపీ ఆస్తుల్ని తెలంగాణకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. ఆర్టికల్ 3 ద్వారా కేంద్రం విభజన నిర్ణయం తీసుకోవచ్చని అప్పట్లో సలహా ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? అని బాలకోటయ్య ప్రశ్నించారు.