Jagan: సూళ్లూరుపేట ఎమ్మెల్యే కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్

  • నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం జగన్
  • కనపర్తిపాడులో పెళ్లి వేడుక
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
CM Jagan attends Sullurpet MLA Sanjeevaiah daughter wedding

ఏపీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనకు విచ్చేశారు. విజయవాడలో జయహో బీసీ సభలో పాల్గొన్న ఆయన, ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడు విచ్చేశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె సౌజన్య వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ పెళ్లి కార్యక్రమం కనపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా వధూవరులు సౌజన్య, డాక్టర్ శ్రావణ్ కుమార్ లకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారికి తన ఆశీస్సులు అందించారు. 

ఈ వివాహ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం జగన్ తాడేపల్లి తిరుగు పయనమయ్యారు.

More Telugu News