Thiru Veer: ముఖం కనిపించకుండా భయపెట్టిన 'మసూద' ఈమెనే!

  • సక్సెస్ టాక్ తెచ్చుకున్న 'మసూద'
  • ఆ పాత్రలో నటించిన అఖిల 
  • తొలిసారిగా స్టేజ్ పైకి వచ్చిన అఖిల
  • బాంధవి శ్రీధర్ నటనకి లభించిన ప్రశంసలు
Masooda Movie update

'మసూద' ఈ మధ్య కాలంలో ఆకట్టుకున్న హారర్ థ్రిల్లర్ చిత్రాలలో ముందువరుసలో కనిపిస్తుంది. అరబిక్ లెటర్స్ స్టయిల్లో తెలుగు టైటిల్ ను డిజైన్ చేయడంతోనే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరగడం మొదలైపోయింది. ఇక ఈ సినిమా విషయంలో డైరెక్టర్స్ రెండు విషయాల్లో మరింత శ్రద్ధ తీసుకున్నాడు. 

సాధారణంగా ఏ సినిమాలోనైనా టైటిల్ రోల్ ను పోషించినవారిని చూపించకుండా ఉండరు. కానీ 'మసూద' పాత్రను పోషించిన యువతి ముఖం సినిమా మొత్తంలో ఎక్కడా కనిపించదు. మొదటి నుంచి చివరి వరకూ ఆ పాత్ర బురఖాలోనే ఉంటుంది. ఆ పాత్రను పోషించింది తానే అని నిన్న జరిగిన థాంక్యూ మీట్ లో అఖిల స్వయంగా చెప్పుకునేవరకూ ఎవరికి తెలియదు.

ఇక ఈ సినిమాలో 'మసూద' ఆత్మ ఆవహించిన యువతిగా బాంధవి శ్రీధర్ నటించింది. ఆమెకి తెలుగులో ఇదే మొదటి సినిమా. ఈ అమ్మాయి ఎవరికీ తెలియకపోవడం వలన ఎవరికీ ఎలాంటి అంచనాలు ఉండవు. కానీ ఆమె యాక్టింగ్ చూసిన తరువాత మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.

More Telugu News