ఇన్ని రోజులుగా నేను చూసిన శ్రీహాన్ వేరు: ఫైమా

  • బిగ్ బాస్ నుంచి బయటికొచ్చిన ఫైమా
  • తను మారవలసిన పనిలేదని వ్యాఖ్య 
  • శ్రీహాన్ మారిపోయాడని వెల్లడి
  • తనని ప్రోత్సహించింది ఆదిరెడ్డి అంటూ వివరణ
Bigg Boss 6  Update

బిగ్ బాస్ హౌస్ లో 13 వారాల పాటు సందడి చేసిన ఫైమా, పోయిన ఆదివారం రోజున హౌస్ లో నుంచి బయటికి వచ్చేయవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె 'బీబీ కేఫ్'కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఫైమా మాట్లాడుతూ .. "నాకు కాస్త వెటకారం ఎక్కువ అనే ముద్రపడిపోయింది. కానీ నిజానికి నేను బయట ఎలా ఉంటానో .. లోపల కూడా అంతే ఉన్నాను. నేను ఎంతమాత్రం మారలేదు .. మారితే ఫైమాను ఎలా అవుతాను" అంది. 

"ప్రతి విషయానికి మాటల యుద్ధం చేస్తాననీ, మాటల పరిధి దాటిపోతే బాడీ లాంగ్వేజ్ కి పని చెబుతానని అనడంలో నిజం లేదు. నేను ఎవరినైనా ఏమైనా అంటే అది గేమ్ పరంగానే తప్ప ... వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. మొదట్లో ఇనయాతో ఫ్రెండ్లీగా ఉండేదానిని .. కానీ ఆమె నేను అనని ఒక మాటను అన్నట్టుగా ప్రచారం చేయడం వలన తేడా వచ్చింది" అని అంది. 

"శ్రీహాన్ కూడా వెటకారం చేసేవాడు .. ఇక ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి కూడా అరవడం మొదలుపెట్టాడు. 12 వారాల పాటు అరవని శ్రీహాన్ కి ఇప్పుడు నోరు లేస్తోంది. నేను బయటికి వచ్చేటప్పుడు కూడా అదే విషయాన్ని తనతో చెప్పి వచ్చాను. ఇక హౌస్ లో ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించినవారు ఎవరైనా ఉన్నారంటే అది ఆదిరెడ్డినే" అంటూ చెప్పుకొచ్చింది.

More Telugu News