AAP: ఎగ్జిట్ పోల్స్ పై కేజ్రీవాల్ ఏమన్నారంటే..!

What Arvind Kejriwal Said On Gujarat Exit Polls That Predict Poor AAP Show
  • గుజరాత్ లో ఆప్ ప్రభావం అంతంతేనని తేల్చిన ఎగ్జిట్ పోల్స్ 
  • పార్టీ ఓట్ల శాతం పెంచుకుంటుందని అంచనాలు
  • తొలి ప్రయత్నంలోనే 15% నుంచి 20% ఓట్లు దక్కించుకోవడం సానుకూలమన్న కేజ్రీవాల్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దాదాపు అన్ని సర్వేల ఫలితాల్లోనూ ఆప్ దక్కించుకునే సీట్ల సంఖ్య తక్కువగానే ఉంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో 15 శాతం నుంచి 20 శాతం ఓట్లు ఆప్ అభ్యర్థులకే పడ్డాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడైంది. ఈ ఫలితాలపై ఆమ్ ఆద్మీ చీఫ్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం స్పందించారు. 

తొలిసారి పోటీ చేసినప్పటికీ దాదాపు 20 శాతం ఓట్లను దక్కించుకోవడమంటే మాటలు కాదని కేజ్రీవాల్ చెప్పారు. అదికూడా బీజేపీకి కంచుకోట వంటి రాష్ట్రంలో ఈ స్థాయిలో ఫలితాలు రాబట్టడం సాధారణ విషయం కాదని చెప్పారు. గుజరాత్ ప్రజల మనసులను తాము గెలుచుకున్నామనేందుకు ఈ అంచనాలే నిదర్శనమని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పార్టీకి సానుకూలంగానే భావిస్తున్నట్లు కేజ్రీవాల్ వివరించారు. 

మరోపక్క, ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ తేలింది. ఇక, హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ ప్రభావం చూపించలేదని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి.
AAP
Arvind Kejriwal
Gujarat election
mcd polls
kejriwal responce

More Telugu News