ఇప్పుడు పెప్సీకో వంతు.. వందలాదిమంది ఉద్యోగులు ఇంటికి
- ఇప్పటికే ఉద్యోగులను వదిలించుకున్న పలు టెక్ కంపెనీలు
- నార్త్ అమెరికాలోని ప్లాంట్‌లో వందలాదిమందిని ఇంటికి పంపేస్తున్న పెప్సీ కో
- ఇప్పటికే ఉద్యోగులకు మెమోల జారీ
నార్త్ అమెరికాలోని స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్‌లో వందలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్’ జర్నల్ పేర్కొంది. ఉద్యోగులు అందుకున్న ఇంటర్నల్ మెమోలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. సంస్థను మరింత సులభతరంగా మార్చడంలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్ ఇస్తున్నట్టు తన కథనంలో పేర్కొంది. అయితే, పెప్సీ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.
పెరిగిన చక్కెర, మొక్కజొన్న, బంగాళదుంపల ధరలతో పెరిగిన భారాన్ని పెప్సీకో వినియోగదారులపైకి నెట్టేస్తుంది. అయినప్పటికీ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, ధరలు పెరిగినప్పటికీ తమ ఉత్పత్తులు మార్కెట్లో ఇంకా బలంగానే ఉన్నాయని చెప్పడం గమనార్హం.