చూస్తుండగానే సత్యదేవ్ ఎదిగిపోతున్నాడు: అడివి శేష్

  • సత్యదేవ్ హీరోగా 'గుర్తుందా శీతాకాలం'
  • ఆయన సరసన అలరించనున్న ముగ్గురు భామలు
  • ప్రత్యేకమైన ఆకర్షణగా కాలభైరవ బాణీలు 
  • ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల 
Gurthunda Seetakalam Pre Release Event

సత్యదేవ్ కథానాయకుడిగా నాగశేఖర్ దర్శకత్వంలో 'గుర్తుందా శీతాకాలం' సినిమా రూపొందింది. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అడివి శేష్ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. ఈ వేదికపై అడివి శేష్ మాట్లాడాడు. 

"తమన్నాతో కలిసి నటించాలని ఉంది. కొన్నేళ్లకి ఒకసారి మాత్రమే మేము కలుసుకోవలసి వస్తుంది. ఈ సారి అంత గ్యాప్ రాకుండా ఉండాలని అనుకుంటున్నాను. ఈ రోజున నేను ఇక్కడికి రావడానికి కారణం సత్యదేవ్. ఈ ఈవెంటుకు నిర్మాతగారు నన్ను ఆహ్వానించారు. వెంటనే నేను సత్యదేవ్ కి కాల్ చేసి వస్తున్నట్టుగా చెప్పాను.

నేను నాకు సంబంధించిన సినిమాల్లో చేయమని సత్యదేవ్ ను అడుగుదామని అనుకుంటూ ఉండగానే తాను అంచలంచెలుగా ఎదిగిపోతున్నాడు. సత్యదేవ్ నాకు చాలా మంచి మిత్రుడు. ఆయన చేసిన ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News