Secunderabad: సికింద్రాబాద్‌లో దారుణం.. కళ్లలో కారం కొట్టి 14 తులాల బంగారు ఆభరణాల దోపిడీ!

Man Attacked in Secunderabad and Robbed 14 tolas gold jewellery
  • హిమాయత్‌నగర్ నుంచి సికింద్రాబాద్ బయలుదేరిన బాధితుడు
  • సికింద్రాబాద్ సిటీలైట్ సమీపంలో దుండగుడి దాడి
  • కళ్లలో కారం చల్లి, కత్తితో పొడిచి ఘాతుకం
సికింద్రాబాద్‌లో గత రాత్రి దారిదోపిడీ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడిచేసిన దుండగుడు అతడి కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచి 14 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యాడు. హిమాయత్ నగర్‌లోని రాధే జువెల్లర్స్‌కు చెందిన పవన్ బంగారు నగలతో సికింద్రాబాద్ బయలుదేరాడు.

సికింద్రాబాద్ చేరుకున్నాక సిటీలైట్ హోటల్ సమీపంలో దుండగుడు అతడిపై దాడిచేసి కళ్లలో కారం చల్లి, కత్తితో పొడిచాడు. అనంతరం అతడి వద్దనున్న 14 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
Secunderabad
Robbery
Himayat Nagar
Crime News

More Telugu News