ABN: సీఐడీ విచారణకు హాజరైన ఏబీఎన్ వెంకటకృష్ణ

ABN Venkata Krishna attends CID questionning
షార్ట్స్‌లో చూడండి
ఏబీఎన్ చానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ ఏపీ సీఐడీ విచారణకు హాజరయ్యారు. న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణతో కలిసి సీఐడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. వీరితో పాటు బీజేపీ నేత మువ్వా సత్యనారాయణ, టీడీపీ నేత రాయపాటి సాయికృష్ణ కూడా ఉన్నారు. ఈ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని వీరికి సీఐడీ అధికారులు సూచించగా... వెంకటకృష్ణ 10.20 గంటలకే అక్కడకు చేరుకున్నారు. వెంకటకృష్ణను సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించనున్నారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో వీరిని సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు.
Go Back to Shorts
ABN
Venkata Krishna
CID
Raghu Rama Krishna Raju

More Telugu News