K Kavitha: ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు: కవిత

  • లిక్కర్ స్కాంలో తన పేరు లేదని సీబీఐకి కవిత లేఖ
  • రేపటి విచారణకు హాజరు కాలేనని తెలిపిన కవిత
  • 11, 12, 14, 15 తేదీల్లో విచారణ జరపొచ్చన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
My name is not CBI FRI says Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాలో తన పేరు లేదని సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ముందుగా ఖరారైన కొన్ని కార్యక్రమాల నేపథ్యంలో, రేపటి విచారణకు తాను హాజరుకాలేనని ఆమె తెలిపారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా తన నివాసంలో విచారణ జరపవచ్చని చెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని, విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఇంతకు ముందే కవిత సీబీఐకి తొలి లేఖ రాశారు. ఐఎఫ్ఐఆర్ కాపీ, డాక్యుమెంట్లు తనకు పంపాలని... ఆపై విచారణ తేదీని ఖరారు చేయవచ్చని చెప్పారు. ఆమె కోరిన విధంగానే సీబీఐ అధికారులు వాటిని ఆమెకు పంపించారు. వాటిని పరిశీలించిన కవిత ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని సీబీఐకి రెండో లేఖ రాశారు. దీనిపై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

More Telugu News