Pawan Kalyan: సాహో డైరెక్టర్ తో పవన్ కొత్త సినిమా

Pawan kalyan next movie with sahoo director sujeeth
  • అధికారికంగా ప్రకటించిన డివీవీ ఎంటర్ టైన్ మెంట్
  • సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణం
  • ఆదివారం పోస్టర్ రిలీజ్ చేసిన డీవీవీ దానయ్య
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చేసింది. సాహో డైరెక్టర్ సుజిత్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తారని, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ కొత్త పోస్టర్ ను ఆదివారం రిలీజ్ చేస్తూ.. పవన్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారని క్యాప్షన్ ఇచ్చింది.

ఈ పోస్టర్ లో పవన్ వెనకవైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తారని సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ తెలిపింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, పవన్ కల్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్నారు.
Pawan Kalyan
new movie
dvv
saho director
poster

More Telugu News