సంక్రాంతిని ఖాయం చేసుకున్న 'వీరసింహా రెడ్డి!

03-12-2022 Sat 16:23 | Entertainment
  • బాలయ్య తాజా చిత్రంగా 'వీరసింహా రెడ్డి'
  • కథానాయికగా సందడి చేయనున్న శ్రుతి హాసన్
  • ప్రతినాయకుడిగా దునియా విజయ్ 
  • సంగీతాన్ని సమకూర్చిన తమన్ 
  • జనవరి 12వ తేదీన సినిమా విడుదల 
Veera Simha Reddy Movie Release Dateb Confirmed
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహా రెడ్డి' సినిమా రూపొందుతోంది. రాయలసీమ నేపథ్యంలో నడిచే ఫ్యాక్షన్ స్టోరీ ఇది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ సందడి చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్టు కొంతకాలం క్రితమే చెప్పారు. అయితే సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల సంఖ్య పెరుగుతూ ఉండటం .. బాలయ్య సినిమా షూటింగు ఇంకా పూర్తి కాలేదనే టాక్ రావడంతో రిలీజ్ విషయంలో అందరికీ డౌట్ వచ్చింది.

దాంతో ఈ సినిమా టీమ్ రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేసింది. 'జనవరి 12వ తేదీన వస్తున్నా' అంటూ బాలయ్య చూపుడు వ్రేలు చూపుతున్న పోస్టర్ ను వదిలారు. ఆ రోజున రిలీజ్ కావడం పక్కా అనే విషయాన్ని గట్టిగానే చెప్పారు. వరలక్ష్మి శరత్ కుమార్ .. దునియా విజయ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. .