​భార్యకు కోటి రూపాయల కానుక నిచ్చిన త్రివిక్రమ్

  • సౌజన్యకు బీఎండబ్ల్యూ కారు కొనిచ్చిన త్రివిక్రమ్
  • ఇటీవల కారు డెలివరీ
  • సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు
Trivikram gifted his wife a BMW

టాలీవుడ్ అగ్రశ్రేణి డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన అర్ధాంగి సౌజన్యకు ఖరీదైన కానుక నిచ్చారు. ఇటీవల తన భార్యకు త్రివిక్రమ్ ఓ విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్ గా అందించారు. ఈ కారు ధర రూ.1.34 కోట్లు అని తెలుస్తోంది. బీఎండబ్ల్యూ ప్రతినిధులు కొన్నిరోజుల కిందట కారును సౌజన్యకు డెలివరీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. 

త్రివిక్రమ్ భార్య సౌజన్య దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కుమార్తె అన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి సంధానకర్త సిరివెన్నెలే. సౌజన్య మొదట్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. ఆమె భరతనాట్య కళాకారిణి. పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. 

ఇక, త్రివిక్రమ్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక అల్లు అర్జున్ తో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.

More Telugu News