ఫైబ్రోమయాల్జియా నన్ను విశ్రాంతి తీసుకునేలా చేసింది: పూనమ్ కౌర్

02-12-2022 Fri 13:28 | Entertainment
  • ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించిన పూనమ్
  • ఎన్నో ప్రణాళికలతో ఉన్న తాను విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని పోస్ట్
  • త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల కామెంట్లు
Poonam Kaur reveals she has been diagnosed with Fibromyalgia
ప్రముఖ తెలుగు నటి పూనమ్ కౌర్ తనకు ఫైబ్రోమయాల్జియా వ్యాధి నిర్ధారణ అయినట్టు ప్రకటించింది. మరో తెలుగు నటి సమంత మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు ఇటీవలే ప్రకటించడం గమనార్హం. అంతలోనే పూనమ్ కౌర్ తన అభిమానులకు చేదు వార్త వినిపించింది. తాను ఫైబ్రోమయాల్జియా బారిన పడ్డట్టు పూనమ్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించింది. శరీరం అంతటా తీవ్రమైన నొప్పి, అలసట, డిప్రెషన్ ఫైబ్రోమయాల్జియా వ్యాధి లక్షణాలు. దీన్ని చూసిన అభిమానులు జాగ్రత్తలు తీసుకుని, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం పూనమ్ కౌర్ నటించిన నాతి చరామి సినిమా విడుదల కావాల్సి ఉంది. ‘‘ఎన్నో ప్రణాళికలతో ఉత్సాహంగా ఉన్న వ్యక్తిని ఫైబ్రోమయాల్జియా, నిదానించి విశ్రాంతి తీసుకునేలా చేసింది’’ అంటూ పూనమ్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ లో పేర్కొంది. ఇటీవలే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సమయంలో.. పూనమ్ కౌర్ ఆయనతో కలసి కొంత దూరంపాటు పాల్గొనడం తెలిసిందే.