Rahul Gandhi: రాహుల్ గాంధీ పాదయాత్రలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. వీడియో ఇదిగో!

Actress Swara Bhasker with Rahul Gandhi Bharat Jodo Yatra
  • మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొనసాగుతున్నరాహుల్ యాత్ర
  • రాహుల్‌తో నడుస్తూ ముచ్చటించిన నటి స్వర భాస్కర్
  • ఫొటోలు, వీడియోలను పంచుకున్న ట్విట్టర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సెప్టెంబరు 7న కన్యాకుమారిలో మొదలై సుదీర్ఘంగా సాగుతోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో పూర్తయింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. రాహుల్ యాత్రకు ఆయా ప్రాంతాల్లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు ప్రకటిస్తూ ఆయన వెంట నడుస్తున్నారు. తాజాగా, బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. ఉజ్జయినిలో ఆయన వెంట నడుస్తూ, ముచ్చటిస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 

రాహుల్ యాత్రకు మద్దతు ప్రకటించి, ఆయన వెంట నడిచిన వారిలో అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూజా భట్, పూనమ్ కౌర్, రియా సేన్, సుశాంత్ సింగ్, మోనా అంబేగావ్కర్, రష్మీదేశాయ్, ఆకాంక్ష పూరీ తదితరులు ఉన్నారు. హాలీవుడ్ స్టార్ జాన్ కుసాక్ కూడా రాహుల్ పాదయాత్రకు ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించారు. కాగా, రాహుల్ భారత్ జోడో యాత్ర 150 రోజులు కొనసాగుతుంది. ఈ యాత్రలో రాహుల్ మొత్తంగా 3,570 కిలోమీటర్లు నడుస్తారు. జమ్మూకశ్మీర్‌లో యాత్ర ముగుస్తుంది.
Rahul Gandhi
Bharat Jodo Yatra
Swara Bhasker
Congress

More Telugu News