మోదీకి మద్దతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాలి: సీపీఐ నారాయణ
- ఏపీలో వైసీపీ గెలిస్తే బీజేపీ గెలిచినట్టేనన్న నారాయణ
- బీజేపీకి వైసీపీ నుంచే అధిక మద్దతు లభిస్తోందని స్పష్టీకరణ
- టీడీపీని బలహీనపర్చడం కోసం బీజేపీ పవన్ కల్యాణ్ ను లాగుతోందని వ్యాఖ్య
తమను వ్యతిరేకించే రాష్ట్రాల ప్రభుత్వాలపైనా, పార్టీలపైనా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోందని నారాయణ ఆరోపించారు. ఒకవేళ ఆ కేసుల్లో ఉన్నవాళ్లు బీజేపీలో చేరగానే రాత్రికిరాత్రే కేసులు మాయమవుతాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మోదీకి జై కొడితే కేసులన్నీ తొలగిపోతాయని పేర్కొన్నారు. శారద కేసుల్లో ఉన్న టీఎంసీ నేతలు బీజేపీలో చేరగానే ఏమైంది? అన్నారాయన.