శివుడొచ్చాడ్రా .. 'బెదురులంక' మోషన్ పోస్టర్ రిలీజ్!

30-11-2022 Wed 13:17 | Entertainment
  • కార్తికేయ హీరోగా రూపొందిన 'బెదురు లంక'
  • ఆసక్తిని రేపుతున్న మోషన్ పోస్టర్ 
  • స్టైలీష్ లుక్ తో కనిపిస్తున్న కార్తికేయ 
  • కథానాయికగా అలరించనున్న నేహా శెట్టి
Beduru Lanka Movie Update
హీరో కార్తికేయ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది 'ఆర్ ఎక్స్ 100' సినిమానే. ఆ తరువాత ఆయన వరుస సినిమాలు చేస్తూ వెళ్లినా హిట్ మాత్రం దొరకలేదు. తమిళంలో చేసిన 'వలిమై' అక్కడే కాదు, ఇక్కడ కూడా ఆయనను నిరాశ పరిచింది. ఆ తరువాత ఆయన ఏ సినిమా చేస్తున్నాడనే అప్ డేట్ లేదు. 

కొంతసేపటి క్రితం ఆయన హీరోగా 'బెదురులంక 2012' టైటిల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ను వదిలారు. కార్తికేయ చాలా స్టైలీష్ లుక్ తో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. 'వచ్చాడ్రా .. శివుడొచ్చాడ్రా' అనే ఒక నినాదం వంటి కోరస్ పై ఈ మోషన్ పోస్టర్ ను వదిలారు. 

మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన తీరు కొత్తగానే ఉందిగానీ, కాన్సెప్ట్ ఏమిటనేది అంచనాలకి అందడం లేదు. క్లారిటీతో చెప్పటానికి వాళ్లు ప్రయత్నించలేదు. రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్న ఈ సినిమాకి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, నేహా శెట్టి కథానాయికగా కనిపించనుంది.