Topudurthi Chandrasekhar Reddy: చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు

YCP Leader Topudurthi Chandrasekhar Reddy Say Sorry To Chandrababu
  • ర్యాలీగా అనంతపురం వచ్చి ఎస్పీని కలిసిన చంద్రశేఖరరెడ్డి
  • ఆవేదనతో చంద్రబాబు కుటుంబంపై ఏదైనా మాట్లాడి ఉంటే క్షమించాలన్న ఎమ్మెల్యే సోదరుడు
  • పార్టీ శ్రేణులు, ప్రజల తరపున క్షమాపణ చెప్పిన చంద్రశేఖరరెడ్డి 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వైసీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖరరెడ్డి క్షమాపణలు చెప్పారు. ఎస్పీని కలిసేందుకు నిన్న అనుచరులతో కలిసి ర్యాలీగా అనంతపురం వచ్చిన చంద్రశేఖరెడ్డి ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.

తమ విధానాలను చెప్పే విషయంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై ఆవేదనతో ఏదైనా మాట్లాడి ఉంటే ఈ ప్రజల తరపున, పార్టీ శ్రేణుల తరపున తాను క్షమాపణ కోరుతున్నట్టు చంద్రశేఖరరెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News