ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన బిగ్ బాస్!

  • బిగ్ బాస్ హౌస్ లో నిన్న ఎలిమినేషన్స్ ప్రక్రియ 
  • సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిన ఆదిరెడ్డి - రోహిత్ 
  • రాజ్ తో పాటు ఎలిమినేషన్ కి నిలబడ్డ ఫైమా 
  • రాజ్ కంటే ఆమెకి తక్కువ ఓట్లు పడటమే ఆశ్చర్యం 
  • హౌస్ నుంచి బయటికొచ్చిన రాజ్
Bigg Boss 6  Update

బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి ఆదివారం రాగానే అందరిలో టెన్షన్ పెరిగిపోతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అందరిలో కుతూహలాన్ని పెంచుతుంది. ఈ సారి ఎలిమినేషన్స్ కి సంబంధించిన రౌండ్ మొదలయ్యేసరికి అదిరెడ్ది .. ఫైమా .. రోహిత్ .. రాజ్ లైన్లో ఉన్నారు. ఆదిరెడ్డి - ఫైమా సేఫ్ అవుతారనీ, రోహిత్ - రాజ్ లలో ఎవరో ఒకరు వెళ్లిపోవచ్చని అంతా అనుకున్నారు. 

కానీ ఆశ్చర్యంగా అదిరెడ్డితో పాటు రోహిత్ సేఫ్ అయ్యాడు. టాప్ 5లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఫైమా. రాజ్ తో పాటు ఆమె ఎలిమినేషన్ లో నిలబడటం ఆడియన్స్ ను అయోమయానికి గురిచేసింది. ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. ఆ పాస్ ద్వారా ఎలిమినేషన్ ను తనని తాను సేవ్ చేసుకోవచ్చు .. తనపై తనకి నమ్మకం ఉంటే ఎదుటివారిని సేవ్ చేయడానికి దానిని వాడొచ్చు. ఆడియన్స్ ఇచ్చే ఓట్ల కారణంగా తాను ఎలిమినేట్ కాననే నమ్మకంతో ఉన్న ఫైమా, ఆ పాస్ తో రాజ్ ను సేవ్ చేద్దామని అనుకుంది. 


అయితే ఆ ఎవిక్షన్ పాస్ తో తనని తాను సేవ్ చేసుకోవడమే మంచిదనే అభిప్రాయాన్ని ఇంటి సభ్యులు వ్యక్తం చేశారు. దాంతో ఆమె ఎవిక్షన్ పాస్ ను తన కోసమే ఉపయోగించుకుంటున్నట్టు చెప్పింది. దాంతో ఆమె కంటే ఎక్కువ ఓట్లు ఉన్నప్పటికీ రాజ్ బయటికి వెళ్లిపోవలసి వచ్చింది. టాప్ 5లో ఉన్న ఫైమాను రాజ్ తో పాటు ఎలిమినేషన్ కి నిలబెట్టడం .. రాక్ కంటే ఆమెకి తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పడం ఒక రకంగా ఆడియన్స్ కి షాక్ ఇచ్చిందనే చెప్పాలి..

More Telugu News