Ali: ఘనంగా అలీ కూతురు వివాహం.. చిరంజీవి, నాగార్జున, రోజా సందడి!

Chiranjeevi Nagarjun and Roja attends Ali daughters marriage
  • హైదరాబాద్ లో నిన్న ఘనంగా జరిగిన అలీ కుమార్తె వివాహం
  • పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టాలీవుడ్ సెలబ్రిటీలు
  • ఇప్పటి వరకు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన అలీ
ప్రముఖ సినీ హాస్య నటుడు అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వివాహానికి టాలీవుడ్ సెటబ్రిటీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులు, నాగార్జున - అమల దంపతులు, ఏపీ మంత్రి రోజా తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు ఇటీవలే అలీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవిని కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు. సినిమాల విషయానికి వస్తే 1979లో వెండితెరకు పరిచయమైన అలీ ఇప్పటి వరకు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.

Ali
Daughter
Marriage
Chiranjeevi
Nagarjuna
Roja

More Telugu News