శబరిమల భక్తుల కోసం 38 ప్రత్యేక రైళ్లు!

26-11-2022 Sat 07:28 | Both States
  • డిసెంబరు, జనవరి నెలల్లో అందుబాటులో
  • సికింద్రాబాద్, హైదరాబాద్, నర్సాపూర్ నుంచి బయలుదేరనున్న రైళ్లు
  • తిరుగు ప్రయాణంలో కొల్లాం, కొట్టాయం నుంచి రైళ్లు
South Central Railway announce 38 special Trains to sabarimala devotees
శబరిమల భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నర్సాపూర్ నుంచి ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

రైళ్ల రాకపోకలు ఇలా..
 * హైదరాబాద్-కొల్లాం: డిసెంబరు 5, 12, 19, 26, మళ్లీ జనవరి 2, 9, 16
 * కొల్లాం-హైదరాబాద్ : డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17
 * నర్సాపూర్-కొట్టాయం: డిసెంబరు 2, 9, 16, 30, జనవరి 6, 13
 * కొట్టాయం-నర్సాపూర్ : డిసెంబరు 3, 10, 17, 24, జనవరి 7, 14
 * సికింద్రాబాద్-కొట్టాయం: డిసెంబరు 4, 11, 18, 25, జనవరి 1, 8
 * కొట్టాయం-సికింద్రాబాద్ : డిసెంబరు 4, 11, 18, 25, మళ్లీ జనవరి 2, 9 తేదీల్లో రైళ్లు బయలుదేరుతాయి.