విశాఖ ట్రాఫిక్ పోలీసుల రసీదులపై ఏసుక్రీస్తు బోధనలు.. పోలీసుల వివరణ ఇదీ!
- ఆటోలకు జారీ చేసే రసీదులపై ఏసు బోధనలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు
- పోలీసులను నిలదీసిన బీజేపీ నేతలు
విషయం తెలిసిన బీజేపీ నేతలు ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పోలీసులు స్పందిస్తూ తమ వద్ద రసీదులు అయిపోవడంతో తమకు ఎప్పుడూ రసీదు పుస్తకాలు ముద్రించి ఇచ్చే వారి నుంచి తమ సిబ్బంది ఓ పుస్తకం తెచ్చారని తెలిపారు. అయితే, వాటిపై ఏసు బోధనలు ఉండడం చూశాక వెంటనే వాటిని జారీ చేయడం ఆపేశామని ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ హరీవుల్లా వివరణ ఇచ్చారు.
కాగా, గతంలో కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ప్రచారంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు వారి సంస్థల పేరుతో ఉన్న రసీదులు సరఫరా చేసేవి. అయితే, ఇప్పుడు జారీ చేసిన రసీదులపై ఆయా సంస్థల పేర్లు లేకపోవడం గమనార్హం.