తెలుగు రాష్ట్రాలకు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తీపి కబురు
- ఏపీ, తెలంగాణలో రహదారుల అభివృద్ధి పనులకు రూ. 573 కోట్లు విడుదల చేసిన గడ్కరీ
- కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జీకి రూ.436.91 కోట్ల మంజూరు
- హైదరాబాద్ - భూపాలపట్నం జాతీయ రహదారి విస్తరణకు రూ. 136.22 కోట్ల విడుదల
ఈ రహదారి వల్ల హైదరాబాద్ నుంచి తిరుపతి, నంద్యాల, చెన్నైల మధ్య దాదాపు 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ ఐకానిక్ బ్రిడ్జి ఇరు రాష్ట్రాలకు గేట్ వేగా నిలుస్తుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇక, రూ.136.22 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి 163 (హైదరాబాద్-భూపాలపట్నం)పై ములుగులో ప్రస్తుతమున్న రెండు లైన్ల రోడ్డు విస్తరణకు కూడా ఆమోదం తెలిపారు. లక్నవరం సరస్సు, బొగత జలపాతం వంటి ప్రముఖ పర్యాటక స్థలాలకు మరింత ప్రాచుర్యం లభించనుంది. అలాగే, ఈ రోడ్డు విస్తరణవల్ల తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయని గడ్కరీ తెలిపారు.