బాసర ట్రిపుల్ ఐటీలో లైంగిక వేధింపులు

25-11-2022 Fri 10:48
  • విద్యార్థినిపై ఇద్దరు ఉద్యోగుల లైంగిక వేధింపులు
  • బాధితురాలి ఫిర్యాదుతో ఉద్యోగుల సస్పెన్షన్
  • విచారణకు ఆదేశించిన ట్రిపుల్ ఐటీ డైరెక్టర్
Sexual assault in Basara IIIT
బాసర ట్రిపుల్ ఐటీలో నిత్యం ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. మొన్నటి వరకు హాస్టల్ సమస్య కొనసాగింది. తాజాగా మరో వివాదం వెలుగు చూసింది. విద్యార్థినులపై కాలేజీ స్టాఫ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. తనను ఇద్దరు ఉద్యోగులు లైంగికంగా వేధించారంటూ ఒక విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. వారి సెల్ ఫోన్లను సీజ్ చేయడమే కాక... విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. వేధింపులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.