'మసూద' షూటింగు నుంచి తిరు పారిపోవాలనుకున్నాడు: సంగీత

23-11-2022 Wed 15:54
  • ఈ నెల 18న విడుదలైన 'మసూద'
  • ఆరంభంలో అంచనాలు లేని సినిమా 
  • మౌత్ టాక్ తో ఊపందుకున్న వసూళ్లు 
  • క్లైమాక్స్ కష్టాలు చెప్పిన సంగీత
Masooda Team Interview
ఈ నెల 18వ తేదీన థియేటర్లకు వచ్చిన 'మసూద' .. మౌత్ టాక్ తో థియేటర్స్ లో నిలబడింది. సాయికిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రాహుల్ యాదవ్ నిర్మాతగా వ్యవహరించాడు. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో సంగీత .. బాంధవి శ్రీధర్ .. తిరువీర్ .. శుభలేఖ సుధాకర్ ప్రధానమైన పాత్రలను పోషించారు. 

తాజాగా ఈ సినిమా టీమ్ ను సుమ ఇంటర్వ్యూ చేసింది. సంగీత మాట్లాడుతూ .. "ఈ సినిమా క్లైమాక్స్ ను మారేడుమిల్లి ఫారెస్టులో తీశారు. విపరీతమైన చలి .. పైగా రెయిన్ ఎఫెక్టు. అలాంటి పరిస్థితుల్లో తిరువీర్ బురదలోపడిన సీన్ తీశారు. ఇక ఈ బాధలు పడటం తనవల్ల కాదని చెప్పేసి తిరువీర్ అక్కడి నుంచి పారిపోదామని అనుకున్నాడు. 

"నాకు చీకటి అంటే చాలా భయం. అలాగే నిశ్శబ్దం అంటే కూడా భయం. అలాంటిది ఈ సినిమా క్లైమాక్స్ ను చీకట్లో చేశారు. ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలకు ముందు సైలెన్స్ ను పాటిస్తూ ఒక్కసారిగా భయపెట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికి భయపెట్టే ఈ జోనర్ కి మేకర్స్ న్యాయం చేశారు. అందువల్లనే ఆరంభంలో ఎవరూ పెద్దగా పట్టించుకోని ఈ సినిమాకి, ఇప్పుడు ఈ స్థాయి క్రేజ్ వస్తోంది" అంటూ చెప్పుకొచ్చింది.