CPI Narayana: బిగ్ బాస్ షోను బ్యాన్ చేసేంత వరకు నా పోరాటం ఆగదు: సీపీఐ నారాయణ

My fight will never end until Big Boss show will be stopped says CPI Narayana
  • తొలి నుంచి బిగ్ బాస్ షోను వ్యతిరేకిస్తున్న నారాయణ
  • తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అసహనం
  • ఏపీ హైకోర్టు స్పందించిందని హర్షం
సినీ నటుడు నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. ఈ షో ఒక సాంఘిక దురాచారం వంటిదని విమర్శించారు. బిగ్ బాస్ షోను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని... తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ ను స్వీకరించలేదని తెలిపారు. 

అయితే ఏపీ హైకోర్టు మాత్రం స్పందించిందని... ఇందుకు ఏపీ హైకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి కూడా నారాయణ దీనిని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టాస్కుల పేరుతో ఈ షోలో అశ్లీలకరమైన కంటెంట్ ను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ గా కూడా ఆయన అభివర్ణించారు.
CPI Narayana
Bigg Boss

More Telugu News