బహిరంగ ముద్దు సీన్ పై ట్రోలర్లకు బదులిచ్చిన శ్రియా శరణ్

23-11-2022 Wed 13:17
  • నచ్చింది రాయడం (ట్రోలింగ్) వారి జాబ్ అంటూ కామెంట్
  • వాటిని పట్టించుకోకపోవడం తన పని అని చెప్పిన శ్రియా
  • ముద్దాడడం ఒకరకమైన సరదా అని అభివర్ణన 
Shriya Saran responds to trolls criticising her for kissing Andrei Koscheev in public
దృశ్యం-2 విడుదల సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో నటి శ్రియా శరణ్, ఆమె భర్త ఆండ్రీ కొచీవ్ రెచ్చిపోయి లిప్ కిస్ పెట్టుకోవడం పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. పాశ్చాత్య దేశాల్లో ఇదేమీ తప్పు కాకపోవచ్చు. కానీ, మన భారతీయ సమాజంలో అది కూడా బహిరంగంగా లిప్ కిస్ అనేది అభ్యంతరకరంగానే ఉంటుంది. ఇది నచ్చని వారు సోషల్ మీడియాలో శ్రియా చర్యను తప్పుబడుతున్నారు. 

న్యూస్18 మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా శ్రియా దీనిపై స్పందించింది. ‘‘ఇదొక రకమైన సరదా! నా ప్రత్యేక క్షణాల్లో నన్ను ముద్దాడడం సాధారణమైన చర్య అని తను అనుకున్నాడు. నా వరకు ఇదొక అందమైనది. సహజమైన చర్యను ట్రోల్ చేయడం ఎందుకన్నది అతడికి (భర్త) అర్థం కాలేదు. కానీ, ఇది ఓకే, ఇది మంచిదే. నేను చెత్త కామెంట్లను చదవను. వాటికి స్పందించను. అది వారి ఉద్యోగం (ట్రోల్ చేయడం). నా ఉద్యోగం వాటిని పట్టించుకోకపోవడం. నేను చేయాలనుకున్నదే చేస్తా’’ అని శ్రియా నిర్మొహమాటంగా చెప్పేసింది. 

తాను నటించిన దృశ్యం 2, ఆర్ఆర్ఆర్, గమనం (2021) సినిమాలపై ఆండ్రీ స్పందన ఏమిటని అడగ్గా.. తన  సినిమాలను ఎంతో ఇష్టపడతాడని చెప్పింది. మరోసారి వాటిని చూసి సరిగ్గా అర్థం చేసుకోవాలన్నది అతడి అభిప్రాయమని తెలిపింది. (శ్రియా, ఆండ్రీ లిప్ కిస్ వీడియో కోసం)