చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య' పాటను ఆస్వాదించిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

22-11-2022 Tue 19:59
  • చిరంజీవి హీరోగా 'వాల్తేరు వీరయ్య'
  • బాబీ దర్శకత్వంలో చిత్రం
  • దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
  • రేపు తొలి పాట విడుదల
  • పాటను ముందే చూసిన పవన్
Pawan Kalyan enjoys Waltair Veerayya first single along with Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు రేపు 'వాల్తేరు వీరయ్య' చిత్రబృందం మ్యూజికల్ ట్రీట్ ఇస్తోంది. ఈ సినిమా నుంచి రేపు బాస్ పార్టీ పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు. కాగా, ఈ పాటను జనసేనాని పవన్ కల్యాణ్ ముందే చూశారు. తన అన్నయ్య చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సింగిల్ ను ఆస్వాదించారు.

దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోల్లో పవన్ కల్యాణ్, చిరంజీవిలతో పాటు 'వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాబీ కూడా ఉన్నారు.