Srinivasarao: గుత్తికోయల దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ రేంజర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్

  • భద్రాద్రి జిల్లాలో ఘటన
  • విధి నిర్వహణలో బలైన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు
  • పోడు వ్యవసాయం వివాదంలో గుత్తికోయల ఘాతుకం
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
CM KCR announces 50 lakhs ex gratia to forest ranger Srinivasarao family

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం ఎర్రగూడ అటవీప్రాంతంలో గుత్తికోయల చేతిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు బలైన సంగతి తెలిసిందే. అటవీభూముల్లో పోడు వ్యవసాయం వివాదం నేపథ్యంలో గుత్తికోయలు కత్తులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లతో శ్రీనివాసరావుపై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన ఆయన ఆసుపత్రిలో మరణించారు. 

ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుత్తికోయల చేతిలో మరణించిన అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాదు, శ్రీనివాసరావు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలం, రిటైర్మెంట్ వయసు వరకు వేతనం అందిస్తామని వెల్లడించారు.

More Telugu News