Anand Devarakonda: గట్స్ ఉన్న డైరెక్టర్ అతను: హరీశ్ శంకర్

Baby teaser launch event
  • వైష్ణవి నాయికగా 'బేబి' మూవీ 
  • దర్శకత్వం వహించిన సాయి రాజేశ్ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
ఆనంద్ దేవరకొండ 'హైవే' తరువాత మరో సినిమా చేశాడు .. ఆ సినిమా పేరే 'బేబి'. సంపూ .. సుహాస్ లు హీరోగా సినిమాలను నిర్మిస్తూ వచ్చిన సాయిరాజేశ్, దర్శకుడిగా చేసిన సినిమా ఇది. శ్రీనివాస కుమార్ నిర్మించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను వదిలారు. 

ఈ వేడుకకి గౌరవ అతిథిగా వచ్చిన హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. "స్టార్స్ ను హీరోలుగా పెట్టి సినిమాలు తీయడం వేరు. కానీ ఒక సంపూర్ణేష్ బాబులో ఆయన హీరోను చూసి రెండు సినిమాలు చేశాడంటే, ఆయన గట్స్ ఉన్న దర్శకుడు అనే విషయం అర్థమవుతోంది" అన్నాడు. 

"ఈ టీజర్ లో నాకు ఆనంద్ దేవరకొండ పాత్ర మాత్రమే కనిపించింది. శ్రీనివాసకుమార్ టీజర్ లాంచ్ ఈవెంటుకే డైరెక్టర్లందరినీ వాడేశాడు. మరి మున్ముందు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. మరి వాటికి మమ్మల్ని ఏ రేంజ్ లో వాడతాడనేది చూడాలి" అంటూ నవ్వేశాడు.
Anand Devarakonda
Vaishnavi
Baby Movie

More Telugu News