ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు చివరి అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
- అడ్మిషన్లకు అవకాశం కల్పించిన ఇంటర్ బోర్డు
- నేటి నుంచి 27 వరకూ అవకాశం
- వెబ్ సైట్లో విద్యార్థుల వివరాల నమోదుకు ఇదే తుది గడువు
వాస్తవానికి గత నెల 15వ తేదీతోనే ఇంటర్ తొలి ఏడాది అడ్మిషన్ల గడువు ముగిసింది. కానీ, కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల వివరాలను ఇంటర్ వెబ్ సైడ్ లో నమోదు చేయలేదు. దాంతో, అడ్మిషన్ల నమోదుకు అవకాశం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ మేరకు చర్యలు తీసుకుంది. అయితే, అడ్మిషన్లకు ఇదే తుది గడువు అని స్పష్టం చేసింది.