జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో మంత్రి రోజా డ్యాన్సులు... వీడియో ఇదిగో!

20-11-2022 Sun 21:44
  • తిరుపతిలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక ఉత్సవాలు
  • హాజరైన రోజా
  • పలు ఆల్బమ్ సాంగ్స్ కు డ్యాన్సులు
  • సందడి చేస్తున్న వీడియోలు
Roja dances in Jagananna Swarnotsava Samskritika Sambaralu
ఏపీ ప్రభుత్వం జగనన్న స్వర్ణోత్సవం సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి జోన్ కు సంబంధించి తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఈ వేడుకలు నిర్వహించగా, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి రోజా హాజరయ్యారు. వేదికపై బాలికలతో కలిసి డ్యాన్స్ చేశారు. పలు పాటలకు చీరకట్టులో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. 

నిన్న తొలి రోజు కూడా డ్యాన్సులు చేసిన రోజా, ఇవాళ కూడా కొన్ని ఆల్బమ్ సాంగ్స్ కు ఉల్లాసంగా డ్యాన్స్ చేయడం విశేషం. రోజా డ్యాన్సుల వీడియోలు యూట్యూబ్ లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ సందడి చేస్తున్నాయి. 

కాగా, తిరుపతిలో రేపు కూడా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరగనున్నాయి. గుంటూరు జోన్ లో ఈ నెల 24 నుంచి 26 వరకు, రాజమండ్రి జోన్ లో ఈ నెల 29, 30 తేదీల్లో, విశాఖ జోన్ లో డిసెంబరు 7 నుంచి 9 వరకు, రాష్ట్రస్థాయి పోటీలు డిసెంబరు 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు.