ప్రతిష్ఠాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయడం పట్ల చిరంజీవి స్పందన

20-11-2022 Sun 21:01
  • నేటి నుంచి గోవాలో ఇఫీ చలనచిత్రోత్సవం
  • ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ గా చిరంజీవి
  • అవార్డు ప్రకటించిన కేంద్రం
  • కేంద్రానికి, ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి
Chiranjeevi reaction on Indian Film Personality Of The Year award
గోవాలో ప్రారంభమైన ఇఫీ చలనచిత్రోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల చిరంజీవి స్పందించారు. 

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చిరంజీవి వివరించారు. 

అంతకుముందు, చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022గా ప్రకటిస్తూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి విశేష ప్రజాదరణ పొందారని, హృదయాలను కదిలించే నటనా ప్రతిభ ఆయన సొంతమని కొనియాడారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు.