Gongadi Trisha: టీమిండియా అండర్-19 జట్టుకు ఎంపికైన భద్రాచలం అమ్మాయి త్రిష

  • మహిళల క్రికెట్లో చిచ్చరపిడుగు గొంగడి త్రిష
  • ఎనిమిదేళ్లకే జిల్లా స్థాయి జట్టుకు ఎంపిక
  • 12 ఏళ్లకే హైదరాబాద్ మహిళల జట్టులో స్థానం
  • తాజాగా న్యూజిలాండ్ తో సిరీస్ కు ఎంపిక
  • లెగ్ స్పిన్, పవర్ హిట్టింగ్ తో రాణిస్తున్న త్రిష
Gongadi Trisha gets place in Team India under 19 team

భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష టీమిండియా అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికైంది. భారత అండర్-19 అమ్మాయిల జట్టు న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. 15 మంది సభ్యుల అండర్-19 జట్టులో బీసీసీఐ సెలెక్టర్లు త్రిషకు కూడా చోటు కల్పించారు. 

త్రిష ఎనిమిదేళ్ల వయసులోనే ఎంతో ప్రతిభ చూపి జిల్లాస్థాయి అండర్-16 జట్టుకు ఆడింది. ఆపై 12 ఏళ్ల వయసులో అండర్-19 జట్టుకు ఆడింది. అంతేకాదు, త్రిష 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించింది. చిన్న వయసులోనే బీసీసీఐ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. 

త్రిష ప్రధానంగా లెగ్ స్పిన్నర్. అయితే బ్యాటింగ్ లోనూ తన పవర్ హిట్టింగ్ తో  రాణిస్తూ ఆల్ రౌండర్ గా ఎదుగుతోంది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డు త్రిష పేరిట ఉంది.

More Telugu News