Winter: జలుబు వదలట్లేదా..? ఇలా చేసి చూడండి

Winter health cold steam mix these 4 things in water while taking steam to cure cold
  • ఆవిరి పట్టడమే అన్నిట్లోకి మేలైన పద్ధతి: నిపుణులు
  • ఆ నీటిలో నాలుగు తులసి ఆకులు కలిపితే రెట్టింపు ప్రయోజనం
  • వాముతోనూ మంచి ఫలితం ఉంటుందని వెల్లడి
చలికాలం వచ్చిందంటే చాలు చాలామంది జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. మందులు వాడుతున్నా సరే ఓ పట్టానా వదలదీ జలుబు. ముక్కు మూసుకుపోయి రాత్రుళ్లు నిద్రకు దూరమవ్వడం సాధారణమే! ఈ సీజన్‌లో శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు, ఆస్తమా, గుండె జబ్బులతో బాధపడేవారికి చలికాలం చాలా గడ్డుకాలమే. వారు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఆవిరి పట్టడం అన్నిట్లోకి మెరుగైన పద్ధతని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జలుబుతో పాటు ఇది ఫ్లూ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఆవిరి పట్టే ముందు ఆ నీటిలో నాలుగు రకాల పదార్థాలలో ఏ ఒక్క దానిని వేసినా మరింత తొందరగా జలుబును వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అవేంటంటే..

1)  వేడి నీళ్లలో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వామును వేసి, ఆ నీటితో ఆవిరి పట్టుకోవాలని నిపుణులు సూచించారు. వాములోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల జలుబు, దగ్గు నుంచి తొందరగా రిలీఫ్ దక్కుతుంది.

2) జలుబు కారణంగా మూసుకుపోయిన ముక్కు రంద్రాలను పుదీనా ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తెరిపిస్తాయి. ఆవిరి పట్టడానికి సిద్ధం చేసుకున్న వేడి నీటిలో 2 నుంచి 3 చుక్కల పుదీనా నూనెను వేస్తే జలుబు, ఫ్లూ నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుందట.

3)  తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటితో ఆవిరి పట్టాలి. ఇది మూసుకుపోయిన ముక్కును తెరుస్తుంది. ఈ ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ అలర్జీ లక్షణాలు ఉన్నాయి.

4) జలుబు, ఫ్లూ సమయంలో ఆవిరి పట్టేటప్పుడు రాళ్ల ఉప్పును నీటిలో వేస్తే జలుబు పారిపోతుందట. గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పును కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పిని నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్పారు.
Winter
cold
steam mix
cure
water
cough

More Telugu News